ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్
విజయపురిసౌత్: ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని సాగర్ ప్రాజెక్టు గేట్స్ డీఈ మురళీధర్ అన్నారు.మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయపురిసౌత్‌లోని ప్రాజెక్టు ముఖద్వారం శంకుస్థాపన పిల్లర్, ఫౌండేషన్ స్టోన్ వద్ద నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు.అనంతరం డీఈ మురళీధర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పునాది రాయి డిసెంబర్ 10, 1955లో వేశారన్నారు. ఆనాటి డ్యాం నిర్మాణానికి శ్రమించిన కార్మికులను అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 22 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తూ సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ అన్నపూర్ణగా మన్నలను పొందుతుందన్నారు. కార్యక్రమంలో విజయపురిసౌత్ ఎస్‌ఐ షేక్ మహమ్మద్ షఫీ, సీఆర్పీఎఫ్ సీఐ ఖలీల్,స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి, ఏఈఈలు వెంకట సుబ్బయ్య, హిమబిందు, అనిత శ్రీ, భారతి, ఏఎస్‌ఐ సోమలా నాయక్, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మైలపల్లి అప్పలరాజు, వినయతుల్లా,పులుసు వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సాగర్ ప్రాజెక్టు గేట్స్ డీఈ మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment