నెహ్రూనగర్: గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని గోరంట్ల ప్రాంతంలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నగర మేయర్‌ను ఆహ్వానించకపోవడం, శిలాఫలకంలో కూడా ఆయన పేరును చివరిన వేసి అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించిన వైనంపై ‘అధికార ‘పచ్చ’మే’ శీర్షికన ఈనెల 9న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు, వివరణ ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులుకు మేయర్ లేఖ రాశారు. మేయర్ రాసిన లేఖకు నగర కమిషనర్ స్పందించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన ఇంజినీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇంజినీరింగ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 1902 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 64, తూర్పు కెనాల్‌కు 86, పశ్చిమ కెనాల్‌కు 54, నిజాంపట్నం కాలువకు 126, కొమ్మమూరు కాలువకు 1611 క్యూసెక్కులు వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment