మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాడేపల్లిరూరల్ : మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎ.లక్ష్మీకుమారి చెప్పారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో పడవలరేవు వద్ద కృష్ణా మీనోత్సవంలో భాగంగా నదిలో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మీకుమారి, జిల్లా మత్స్యశాఖ అధికారి గాలిదేవుడు, తాడేపల్లి తహసీల్దార్ డి.సీతారామయ్య అధికారులతో కలసి నదిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 12.50 లక్షల చేపపిల్లలను వదిలామని తెలిపారు. కార్యక్రమంలో నిడుబ్రోలు ఎఫ్‌డీవో ఎం.డి.జయినుల్లా ఖాన్, గుంటూరు ఎఐఎఫ్ అధికారి కె.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
బెల్లంకొండ: ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలవగా, వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై డి ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం..మాచవరం మండలం రుక్మిణిపురం గ్రామానికి చెందిన బాణావతు అశోక్ కుమార్ నాయక్(32) పాపాయపాలెం మూడు రోడ్ల కూడలి వద్ద జామకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి బైక్‌పై ఇంటికి వెళుతున్న సమయంలో పాపాయపాలెం శివారులో పిడుగురాళ్ల నుంచి బైక్‌పై ఎదురుగా వస్తున్న వ్యక్తి అశోక్‌కుమార్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు గుంటూరు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment