రామాలయానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలం: ఏపీలోని నెల్లూరుకు చెందిన భక్తులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి రూ.12 లక్షల భారీ విరాళం అందజేశారు. రామాలయానికి చెందిన ప్రచార రథం ద్వారా అక్కడి భక్తుల కోరిక మేరకు ఈనెల 25న సీతారా ముల కల్యాణం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన సంతోష్– సాహిత్య దంపతులు శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో పుష్పాలంకరణ నిమిత్తం రూ.12 లక్షలు విరాళంగా అందజేశారని ఆలయ ఈఓ ఎల్.రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శాశ్వత నిత్యాన్నదానానికి..
శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి భద్రాచలం తాతగుడి సెంటర్‌కు చెందిన ఎం.సుశీల రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజే యా వారు రసీదు ఇచ్చారు. కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment