నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివరాత్రి పర్వదినం సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.
వీరభద్రస్వామికి రూ.20లక్షల విలువైన బంగారు కిరీటాలు
బూర్గంపాడు: బూర్గంపాడు సమీపాన గోదావరి మధ్యలో మోతెగడ్డపై కాకతీయుల కాలం నాటి వీరభద్రస్వామి ఆలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ – నీలిమ దంపతులు రూ.20 లక్షల విలువైన బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, చిగురుమళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిద్ధమవుతున్న
ఫారెస్ట్ స్టేషన్
అశ్వాపురం: మండలంలో మారుమూల ప్రాంతమైన గొందిగూడెం ఫారెస్ట్ సెక్షన్ పరిధి బండ్లవారిగుంపులో ఫారెస్ట్ స్టేషన్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్టేషన్ కోసం ప్రత్యేక కంటైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఓ సెక్షన్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు బీట్ ఆఫీసర్లు, ఐదుగురు బేస్ క్యాంప్ సిబ్బంది ఉంటారు. రాత్రి సమయాన కూడా ముగ్గురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలో ఇది రెండో ఫారెస్ట్ స్టేషన్ కాగా గతంలో మణుగూరు ఫారెస్ట్ రేంజ్ కూనవరం బీట్‌లో ఏర్పాటు చేశారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment