
పోర్ట్‌ఫోలియోలో ఒక్కటే మ్యూచువల్ ఫండ్, అది కూడా ఫ్లెక్సీక్యాప్‌ను కలిగి ఉండొచ్చా? ఎందుకంటే ఒక పథకం సైతం కనీసం 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది కనుక వైవిధ్యం ఉన్నట్టు అవుతుందిగా?
పెట్టుబడుల విషయానికొస్తే వైవిధ్యం ఎంతో ముఖ్యమైనది. అన్ని గుడ్లను ఒక్కటే పెట్టెలో పెట్టడం సరికాదన్నట్టు.. పెట్టుబడులు అన్నింటినీ ఒక్కటే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది అనిపించుకోదు. అనుకున్న విధంగా సంబంధిత సాధనం పనితీరు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అది ప్రతికూలంగా మారిపోతే? అందుకే వైవిధ్యం అన్నది ఈ రిస్క్‌ను తగ్గించేస్తుంది. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. కొన్ని రకాల కంపెనీలు కొన్ని సమయాల్లో మంచిగాను, ప్రతికూలంగాను పనితీరు చూపిస్తుంటాయి.
వివిధ కంపెనీలనేవి, వివిధ రంగాల నుంచి ఉండాలి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినవి అయి ఉండాలి. మెరుగ్గా నిర్వహించే ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలో అయినా ఈ విధమైన వైవిధ్యం ఉంటుంది. వివిధ కంపెనీలు, వివిధ రంగాలు, వివిధ పరిమాణాలతో కూడిన కంపెనీల (మార్కెట్ క్యాప్ ఆధారింగా సైజు) మధ్య పెట్టుబడులు విస్తరించి ఉంటాయి. అందుకే తగినంత భద్రత ఉంటుంది. కాకపోతే పెట్టుబడులు పెట్టే వారు ఫండ్ మేనేజర్ల పరంగా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం 20–30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల తగినంత వైవిధ్యం ఉంటుంది.
కానీ, ఒక్కటే ఫండ్ మేనేజర్ పరిధిలో పెట్టుబడులను పరిమితం చేయడం వల్ల అది రిస్‌్కకు దారితీస్తుంది. ఒక్కటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పరిధిలోని వివిధ పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించినా కానీ, పెట్టుబడుల శ్రేణి ఒక్కటే ఉండడం వల్ల రిస్క్ ఉంటుంది. అందుకుని వివిధ ఫండ్స్ సంస్థల పరిధిలో వివిధ ఫండ్ మేనేజర్ల మధ్య మన పెట్టుబడులను విభజించుకోవాలి. మా నిర్ణయం ప్రకారం నాలుగు లేదా ఐదు ఫథకాలు ఈ విధమైన వైవిధ్యానికి సరిపోతాయి. ఇంతకుమించిన పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల అదనంగా వచ్చే వైవిధ్యం కానీ, రిస్క్ తగ్గడం కానీ ఉండదు. మరీ ఎక్కువ పథకాలు అయినా, పెట్టుబడుల సౌలభ్యం తగ్గుతుంది. నాణ్యమైన ఎంపికే రాబడులను నిర్ణయిస్తుంది.
నా దగ్గర 1995లో కొనుగోలు చేసిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూనిట్లు ఉన్నాయి. వాటిని ఎలా విక్రయించాలి.
ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలంటూ మేము మొదటి నుంచి సూచిస్తున్నాం. మీరు 25 ఏళ్లకు పైగా ఈ పెట్టుబడులను కొసాగించినందుకు అభినందనలు. ఫండ్ హౌస్ కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా మీ పెట్టుబడుల తాజా విలువ ఎంతన్నది తెలుసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్ నుంచి అయినా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
అకౌంట్ తెరిచి, మై ఇన్వెస్ట్‌మెంట్స్ ట్యాబ్ కింద యాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంపిక చేసుకోవాలి. మీ పెట్టుబడుల వివరాలను నమోదు చేయడం ద్వారా ఏ రోజుకారోజు వాటి విలువ ఎంతో చూసుకోవచ్చు. మీ దగ్గరున్న పెట్టుబడులను విక్రయించుకోవాలంటే, అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నుంచి చేసుకోవాలి. లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ (ఏఎంసీ) పంపిణీదారు అయిన క్యామ్స్ లేదా ఫిన్‌టెక్ ద్వారా కూడా రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిడెంప్షన్ ఫామ్‌ను పూరించి సమరి్పంచాలి. యూనిట్లను డీమెటీరియలైజ్ చేసుకుంటే, బ్రోకర్ ద్వారా విక్రయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment