క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి

Published Sat, Nov 23 2024 12:15 AM | Last Updated on Sat, Nov 23 2024 12:15 AM

క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి

క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

జెండాను ఆవిష్కరించిన జిల్లా

ఎస్పీ మణికంఠ

తవణంపల్లె: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్సీ మణికంఠ చందోలు అన్నారు. శుక్రవారం మండలంలోని అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీ పాఠశాల విద్య, జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి అండర్‌–14 బాల బాలికలు సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం చేకూరుతుందన్నారు. క్రీడల్లో టీమ్‌వర్క్‌, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తుందన్నారు. క్రీడల్లో గెలుపు కోసం అన్ని జట్లు పోటీపడినప్పటికీ విజయం సాధించేది ఒకే జట్టు అన్నారు. ఓటమి పాలైన జట్లు నిరుత్సాహపడకుండా మరోసారి విజయం సాధించే దిశగా నిలవాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లా నుంచి వచ్చిన బాలబాలికలు జట్లను పరిచయం చేసుకుని, మార్చ్‌ నిర్వహించిన క్రీడాకారులకు వందనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ వరలక్ష్మి, డీవైఈఓ చంద్రశేఖర్‌, డీఎస్‌డీఓ బాలాజీ, తహసీల్దార్‌ సుధాకర్‌, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓలు హేమలత, త్యాగరాజులు రెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌సుందర్‌రాయల్‌రెడ్డి, జెడ్పీపీటీసీ సభ్యురాలు భారతి, అరగొండ సర్పంచ్‌ మల్లుదొరై, ఉమామహేశ్వరరెడ్డి, హెచ్‌ఎంలు భువనేశ్వరి, మోహన్‌రెడ్డి, జిల్లా స్కూల్‌గేమ్స్‌ కార్యదర్శ వసంతవాణి, టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ కృష్ణ, పీడీలు రవీంద్రరెడ్డి, సిరాజ్‌, శ్రీనివాసులు, అరుణకుమార్‌, ఢిల్లీరాణి, అరుణ, గురుప్రసాద్‌, శాంతమ్మ, ఉమాపతి, నూరుద్ధీన్‌, ఎంపీటీసీ ఇంద్రాణి పాల్గొన్నారు.

విజేతలు వీరే..

● రాష్ట్రస్థాయి అండర్‌–14 బాలుర సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మొదటి రోజు బాలుర జట్లలో ప్రకాశం జిల్లాపై శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. కృష్ణా జిల్లా జట్టుతో పోరాడి వైఎస్సార్‌ కడప జిల్లా జట్లు విజయం సాధించింది. విశాఖపట్నం జట్టుపై చిత్తూరు జట్టు గెలిచింది. ప్రకాశం జిల్లా జట్టుపై వైఎస్సార్‌ కడప జట్టు విజయం సాధించింది.

బాలికల జట్లు: శ్రీకాకుళం జిల్లా బాలికల జట్టుపై గుంటూరు జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా జట్టుపై కర్నూలు జిల్లా బాలికల జట్టు గెలిచి, పట్టు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement