పెండింగ్‌లో 5వేల వ్యవసాయ సర్వీసులు
● త్వరలో ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ విడతల వారీ అందజేస్తాం ● పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో సోలార్ సిస్టం ● డిస్కం సీఎండీ సంతోషరావు వెల్లడి
చిత్తూరు కార్పొరేషన్: వ్యవసాయ విద్యుత్ పరికరాల కొరత ఉందని, త్వరలో పరికరాలు వస్తాయని డిస్కం(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) సీఎండీ సంతోషరావు చెప్పారు. శుక్రవారం ఆయన ఎస్‌ఈ కార్యాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమయ్యా రు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో (మొత్తం 14 నియోజకవర్గాలు) 5 వేలకు పైగా వ్యవసాయ సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ విడతల వారీగా అందజేస్తామన్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద మొత్తం 50 వేల సర్వీసులకు సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రభుత్వ సర్వీసులకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించామని, ప్రభు త్వ, ప్రైవేటు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు కానున్న రూరల్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాకు ఎస్‌ఈ కార్యాలయం కేటా యించడంతో రూరల్ కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రూరల్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటి మరమ్మతులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సీజీఎం అయూబ్‌ఖాన్, ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు సురేష్, మునిచంద్ర, జగదీష్, వాసుదేవరెడ్డి, డీఈలు ప్రసాద్, ఆనంద్, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment