వీఆర్వోకు దేహశుద్ధి | - | Sakshi
Sakshi News home page

వీఆర్వోకు దేహశుద్ధి

Published Sat, Nov 23 2024 12:15 AM | Last Updated on Sat, Nov 23 2024 12:15 AM

-

రామకుప్పం: రపేమ పేరుతో సాటి వీఆర్వోను నమ్మించి పెళ్లి చేసుకోకుండా కాలయాపన చేస్తున్న మరో వీఆర్వోకు ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన శుక్రవారం రామకుప్పం మండలంలో జరిగింది. బాధితురాలి బంధువుల కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన శ్రవణ్‌ రామకుప్పం మండలంలోని కొంగనపల్లి వీఆర్వోగా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని మరో పంచాయతీ వీఆర్వోగా పనిచేస్తున్న యువతిని మూడేళ్లు ప్రేమించాడు. శ్రవణ్‌ ఆ యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని ఆ యువతి, శ్రవణ్‌ను కోరగా కాలయాపన చేస్తూ వచ్చాడు. అంతేగాక అతని ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె జరిగిన విషయాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బంధువులతోపాటు యువతి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్న శ్రవణ్‌ను నిలదీసింది. అతని నుండి పెళ్లి విషయమై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన యువతి బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం వారు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. శ్రవణ్‌ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో శనివారం స్థానిక తహసీల్దార్‌తో చర్చించి వీఆర్వోకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు యువతి బంధువులకు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement