బాలికల భవిష్యత్‌కు కిశోరి వికాసం
● బాలికా సంఘాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపండి ● జిల్లా సీ్త్ర సంక్షేమశాఖ పీడీ హైమావతి
నగరి : బాలికల బంగారు భవిష్యత్తుకు కిశోరి వికాసం కార్యక్రమం పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని జిల్లా సీ్త్ర సంక్షేమశాఖ పీడీ హైమావతి అన్నారు. బుధవారం స్థానిక ఐడీసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కిశోరి వికాసం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి బాలిక భవిష్యత్‌ను మెరుగుపరచడానికి కిశోరి వికాసం మంచి అవకాశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందన్నారు. 11–18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. డిజిటల్ భద్రత, సైబర్‌క్రైమ్, ఆన్‌లైన్ వేదికలపై జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ కె.కృష్ణవేణి, డాక్టర్ సుస్మిత, ఎంపీడీఓ సతీష్, నోడల్ అధికారి ఇ.జయంతి, మున్సిపల్ మేనేజర్ శేఖర్, ఏపీఎం మోహన్, డాక్టర్ ఎయిల్‌అరసన్, హెచ్‌ఎం ప్రసన్న, సిరీడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గిరిజ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment