యాదమరి (కాణిపాకం): ఓ యువకుడి వేధింపులను తాళలేక మైనర్ బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపిన వివరాల మేరకు.. పాచిగుంట గ్రామానికి చెందిన వసంత్‌కుమార్ అనే యువకుడు మైనర్ బాలిక నుంచి బంగారు, వెండి ఆభరణాలను తీసుకున్నాడు. తర్వాత ఆ నగలను తిరిగి ఇవ్వాలని మైనర్ బాలిక పట్టుబట్టడంతో సదరు యువకుడు వేధింపులకు గురి చేశాడు. దీంతో మైనర్ బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు వసంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
10 మంది డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో జరుగుతున్న డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న 10మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జోన్ పరిధిలో ముగ్గురు, చిత్తూరు జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏడుగురు డిబార్ చేసినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment