ప్రభుత్వ భూమిలో టీడీపీ నేతల పాగా
పాలసముద్రం : అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. పాలసముద్రం దళితవాడలో ప్రభుత్వ భూమి, గ్రామనత్తాన్ని అధికార పార్టీ టీడీపీ నాయకులు గత రెండు రోజులుగా జేసీబీతో అక్రమంగా చదును చేసుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళితవాడలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. పాలసముద్రం దళితవాడ సుమారు రెండువేల కుటుంబాలు నివసిస్తున్నారు. భవిష్యత్‌లో పేదలకు ఇంటి పట్టాల కోసం ఉంచిన ప్రభుత్వ స్థలాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా జేసీబీతో చదును చేయించి కొబ్బరిచెట్లు నాటుతున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా జేసీబీతో చదును చేసిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇంటి పట్టా లేనివారికి పట్టాలు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment