విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
పులిచెర్ల(కల్లూరు): విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన పులిచెర్ల మండలం నన్నూరు వారిపల్లె పంచాయతీ కుంటావారిపల్లె సమీపంలో జరిగినట్లు కల్లూరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. తిరుపతికి చెందిన లారీ యజమాని నారాయణరెడ్డి కుంటావారిపల్లె సమీపంలో తన లారీ నిలిచిపోవడంతో డ్రైవర్‌ను పిలుచుకుని బుధవారం ఉదయం వచ్చాడు. డ్రైవర్ సురేంద్రరెడ్డి(55) లారీని పక్కకు పెట్టగా, అటుగా వెళ్లే వారు దారికి అడ్డంగా ఉందని చెప్పడంతో మరోమారు వాహనాన్ని పక్కకు పెడుతుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు లారీకి తగిలాయి. ఈక్రమంలో డ్రైవరు విద్యుత్ తీగలు తగిలిన లారీని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పత్రాలతో హాజరు కావాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు వివిధ ట్రేడ్‌లో ఎంపికై న అభ్యర్థులు ఈనెల 17వ తేదీన గుర్తింపు పత్రాలతో కార్యాలయానికి హాజరు కావాలని డీపీటీఓ జగదీష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండులోని డీపీటీఓ కార్యాలయానికి గుర్తింపు పత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులను డిపోల వారీగా కేటాయిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment