అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. కలెక్టరేట్‌తో పాటు పలు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా కంట్రోల్ రూం నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్–9491077356, ల్యాండ్ లైన్–08572–242777, చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం–9491077011, కుప్పం ఆర్డీఓ కార్యాలయం–9966072234, పలమనేరు ఆర్డీఓ కార్యాలయం–9491074510, నగరి ఆర్డీఓ కార్యాలయం 9652138325 నంబర్లకు ఫిర్యాదులు చేయాలని అధికారులు వెల్లడించారు.
నష్టం వాటిల్లకుండా..
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఎలాంటి నష్టం కలగుండా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూంకు కాల్ చేసి తెలియజేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సమస్యలు ఉన్నట్లైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించాం. ఎవరైనా శిథిలావస్థకు చేరిన, లేదా మట్టి గోడల ఇళ్లల్లో ఉన్నట్లైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పాం. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించాం.
– విద్యాధరి, ఇన్‌చార్జ్ కలెక్టర్, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment