చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పదో తరగతి చదువుతున్న బాలికపై మహేష్ అనే వ్యక్తి ఇటీవల లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బుధవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి ఏనుగు బీభత్సం
ఐరాల: మండలంలో ఒంటరి ఏనుగు మళ్లీ విజృభించింది. గురువారం వేకువజామున వినాయకపురం గ్రామానికి చెందిన రైతు మహేష్ వరి పంటను తొక్కి తిని నాశనం చేసింది. రైతు బాణసంచా సాయంతో ఒంటరి ఏనుగును సమీప అడవిలోకి తరిమేసినట్లు తెలిపాడు. ఆరుగాలం కష్టపడి శ్రమించి వరి పంట సాగు చేస్తే చేతికి వచ్చే సమయంలో ఏనుగు నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.20 వేలు వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment