చిత్తూరు కార్పొరేషన్: రైతు సమస్యల పరిష్కారం కోసం ‘అన్నదాతలకు అండగా వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వారం ముందే నిరసన కార్యక్రమం గురించి, మూడు రోజుల ముందు చిత్తూరులో పోలీసులకు రైతు ర్యాలీ వివరాలు తెలిపి అనుమతులు కోరారు. అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన కూటమి నాయకులు కార్యక్రమాన్ని ఆపాలని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గురువారం రాత్రి చిత్తూరు పార్టీ కార్యాలయం వద్దకు పోలీసులు వచ్చి రేపటి రైతుల నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పివెళ్లారు. నాయకులకు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని బెదిరింపులకు దిగారు. పార్టీ కార్యాలయ సిబ్బంది స్టేషన్‌కు వెళ్ల గా, టీడీపీ నాయకులది అదే సమయంలో ర్యాలీ ఉందని, మీ కార్యక్రమాన్ని ఉద యం 9.30 గంటలకు బదులు 11.30 గంటలకు మార్పు చేసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment