నేటి రైతు ర్యాలీని జయపద్రం చేయండి
చిత్తూరు కార్పొరేషన్: రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీని జయపద్రం చేయాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. స్థానిక గిరింపేటలోని దుర్గమ్మ ఆలయం నుంచి ర్యాలీగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, రైతులతో కలిసి పాల్గొంటారన్నారు. అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు రైతుల డిమాండ్లను ఫ్లకార్డులతో ప్రదర్శనగా చేరుకుంటామని తెలిపారు. అనంతరం రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని వివరించారు.
జాతీయ లోక్ అదాలత్ రేపు
చిత్తూరు అర్బన్: చిత్తూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పక్షాల కక్షిదారులు రాజీచేసుకోవడం ద్వారా.. అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారుల కోసం జిల్లాలోని 35 ప్రాంతాల్లో అదాలత్ నిర్వహణ బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సుబ్రమణ్యంకు గద్దర్ జాతీయ సేవా అవార్డు
రొంపిచెర్ల: గద్దర్ జాతీయ సేవా అవార్డును గ్రేట్ విజన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జీవీ సుబ్రమణ్యంబాబు అందుకున్నారు. మండలంలోని జాండ్లవారిపల్లె పంచాయతీ కన్నంకాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యంబాబు గత 21 ఏళ్లుగా సమాజసేవ చేస్తున్నారు. అందుకు గుర్తింపుగా ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని సాయితేజ జూనియర్ కళాశాలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంబాబు మాట్లాడుతూ ఈ అవార్డు మరింత ఉత్సాహంగా పని చేయడానికి ప్రేరణ అవుతుందన్నారు. కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే సత్య నారాయణ, మమతా స్వచ్చందా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ జాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment