అచ్చార్ల చెరువు మొరవకు గండి | - | Sakshi
Sakshi News home page

అచ్చార్ల చెరువు మొరవకు గండి

Published Sat, Dec 14 2024 1:41 AM | Last Updated on Sat, Dec 14 2024 1:41 AM

అచ్చా

అచ్చార్ల చెరువు మొరవకు గండి

రొంపిచెర్ల మండలంలోని మోటుమల్లెల పంచాయతీ వంకిరెడ్డిగారిపల్లెకు సమీపంలోని అచ్చార్ల చెరువు మొరవ తెగింది.
కాల‘కూటమి’ దగాపై కడుపు మండిన కర్షకుడు దండెత్తాడు.. అన్నదాతకు అండగా వైఎస్సార్‌ సీపీ నిలిచింది. అందని అన్నదాత సుఖీభవ.. పంట నష్ట పరిహారం.. చెల్లించని బీమా ప్రీమియం తదితరాలు అమలు చేయకపోవడంతో నయవంచనకు గురైన పుడమి పుత్రుడిని ఆదుకోవడానికి జగనన్న పిలుపు మేరకు వారికి అండగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాతకు అండగా’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరింపేట వద్ద ఉన్న పూలే భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం సాగిన తీరు ఇలా..

చదరంగ రారాజు గుకేష్‌

చిత్తూరు జిల్లాకు చెందిన గుకేష్‌ చదరంగ రారాజుగా అవతరించడం జిల్లాకే గర్వకారణమని బాలాజీ అన్నారు.

శనివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

చిత్తూరులో ర్యాలీ చేస్తున్న

వైఎస్సార్‌ సీపీ నాయకులు

బాబుది రైతు కుటుంబమే కదా!

రైతు కుటుంబం నుంచి వ చ్చిన సీఎం చంద్రబాబు కు కర్షకుల సమస్యలు పట్టకపోవడం బాధాకరం. రైతుల గోడును కూటమి సర్కారు విస్మరించింది. కూటమి అధికారంలోకి వచ్చిన గత ఆరు నెలల్లో నాలుగుసార్లు తుపానులు వచ్చాయి. జిల్లాలోని వేలాది మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు పంట నష్టపరిహారం ఇవ్వకపోవడం దారుణం.

– రెడ్డెప్ప, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, చిత్తూరు

జగనన్నను తలుచుకుంటున్నారు

జగనన్న ఇచ్చిన హామీలు నెరవేర్చి, మేలు చేశారని ప్రజలు తలుచుకుంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్పుడు గతంలో అందుకున్న మేలును లబ్ధిదారులు మాతో పంచుకుంటున్నారు. అనవసరంగా కూట మి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి, తప్పు చేశా మన్న భావన అన్ని వర్గాల్లో భావన కనిపిస్తోంది.

– భరత్‌, ఎమ్మెల్సీ, చిత్తూరు

అమరావతి రైతులే కనిపిస్తారా?

చంద్రబాబుకు అమరావతి రైతులే కనిపిస్తారా? అని ప్రశ్నిస్తున్నాం. జిల్లాల్లో ని రైతులు కష్టాలు పడుతుంటే వారి గోడు ఎందుకు వినిపించడం లేదని అడుగుతున్నాం. మామిడి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో కర్షకులు నష్ట పోతున్నారు. ఆర్థికసాయం వెంటనే అందించాలి. తడిచిన ధాన్యాన్ని సైతం కోనుగోలు చేయాలి.

– విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ

చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

మోసాల మాంత్రికుడు బాబు

హామీలను అమలు చేయక పోవడంతో చంద్రబాబు మోసాల మాంత్రి కుడు అయ్యారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుల ను అదుకుంటామని చెప్పి లక్షలాది మందిని మోసం చేశారు. ఏమార్చడంలో ఆయనకున్న అనుభవం ఇంకెవరికీ లేదు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే,

వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

అవసరం తీరిపోయిందనే ధోరణి

గెలిచిన తరువాత అవసరం తీరిపోయిందనే ధోరణి లో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎ న్నికల సమయంలో రై తులను అన్ని విధాలుగా అదుకుంటామని ఊదరగొట్టారు. అధికారంలో వచ్చాక అవసరం తీరిపోవడంతో రైతులు, ప్రజలను పట్టించుకోవడం లేదు.

– సునీల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారు?

రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇంకెప్పుడిస్తారని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు న్నాం. అన్నం పెట్టే అన్నదాతకు అన్యాయం చేసే భవిష్యత్త్‌ ఉండదన్న విష యం గుర్తించాలి. రైతులకు ఇస్తామన్న రూ.20 వేలు పెట్టుబడి సాయం వెంటనే మంజూరు చేయాలి. ఈ రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. – కృపాలక్ష్మి, వైఎస్సార్‌సీపీ

గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

గతంలో బాబునెందుకు అరెస్టు చేయలేదు

– వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ రెడ్డెప్ప

చిత్తూరు కలెక్టరేట్‌ : ‘‘గతంలో రాజమండ్రి పుష్కరాలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు విచ్చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మహిళలు మృతి చెందారు. ఆనాడు ఆయన్ని ఎందుకు అరెస్టు చేయలేదు’’ అని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి హీరో అల్లుఅర్జున్‌ పరిహారం అందజేశారని తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి, నెమ్మదిగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కుట్ర పన్ని ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకు అప్పటి సీఎం చంద్రబాబే బాధ్యులని అన్నారు. ఆ ఘటనకు కారణమైన చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు ఒక చట్టం, ఇతరులు మరో చట్టం ఉండకూడదని అన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో

20 మందికి జరిమానా

చిత్తూరు అర్బన్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి రూ.2 లక్షల జరిమానా విధి స్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 20 మందిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

మోడల్‌ పేపర్లు ఉపయోగకరం

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి విద్యార్థులకు మోడల్‌ పేపర్లు ఉపయోగకరమని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విద్యాధరి అన్నారు. శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో యూటీఎఫ్‌ నాయకులు రూపొందించిన పదో తరగతి మోడల్‌ పేపర్ల పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం యూటీఎఫ్‌ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత పేద విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఈఓ వరలక్ష్మి మాట్లాడుతూ యూటీఎఫ్‌ నాయకులు రూపొందించిన మోడల్‌ పేప ర్ల పుస్తకం చాలా బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్‌, సహాధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, రెహనాబేగం, నాయకులు ఎస్పీ బాషా, సరిత, పార్థసారఽథి తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు కార్పొరేషన్‌: కర్షకులకు వెన్నుదన్నుగా వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన అన్నదాతకు అండగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూ రు గిరింపేటలోని పూలే భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ లో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు విజయా నందరెడ్డి, వెంకటేగౌడ, కృపాలక్ష్మి, సునీల్‌కుమార్‌, నగర డిప్యూటీ మేయర్‌ చంద్రశేఖర్‌, జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, నగర పార్టీ అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్‌ కుమారరాజా, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మహి ళా విభాగం జిల్లా కార్యదర్శి గౌహతి, రైతు సంఘం నేతలు కృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, ప్రహ్లాద, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట ర్లు లీనారెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, సరళామేరి, కేపీ శ్రీధర్‌, నారా యణ, త్యాగ, ఆను, రాజారత్నంరెడ్డి, రాజేష్‌రెడ్డి, అన్బు, ప్రతిమ, మనోజ్‌రెడ్డి, వేల్కూరు బాబురెడ్డి, మునిరాజారెడ్డి, తులసీయాదవ్‌, హేమలత, సురేష్‌ రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, మణి, సరిత జనార్దన్‌, శి రీష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బాబురెడ్డి, హరిరెడ్డి, ప్ర తాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, గోవిందస్వామి, సుధాకర్‌రెడ్డి, అంజలి, భాగ్యలక్ష్మి, రజనీ కాంత్‌, మధుసూదన్‌, సుగుణశేఖర్‌రెడ్డి, ప్రకాష్‌, శేఖర్‌, చల్లముత్తు, లక్ష్మణస్వామి, యువరాజ్‌, బా గారెడ్డి, దీప, శుభ, అనిల్‌, వేణురాజు, శ్యామ్‌లాల్‌, మునికృష్ణారెడ్డి, అప్పొజీ, మురళీరెడ్డి, చక్రీ, ప్రస న్న, స్టాన్లీ, చాంద్‌బాషా, శివ, అల్తాఫ్‌ పాల్గొన్నారు.

రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కర్షకులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఇన్‌చార్జి కలెక్టర్‌ విద్యాధరిని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

కుట్రలు మాని..

హామీలు అమలు చేయండి

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసే కుట్రలు మాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలి. రైతుల సంక్షేమంపై శ్రద్ధ చూపాలి. అన్నదాతలను కూటమి సర్కారు ఆదుకోవాలి. – గౌహతిరెడ్డి,

మహిళా విభాగం జిల్లా కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ

పోరాటాలు ఉధృతం చేస్తాం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రైతులకు అన్నదాత సుఖీభవ అందించలేదు. చంద్రబాబు రైతులను ఆదుకుంటామని చెప్పి, మోసం చేస్తున్నారు. గిట్టుబాటు ధర హామీలు కలగానే మిగిలిపోతున్నాయి. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాలు ఉదృతం చేస్తాం.

– గాయత్రీదేవి, మహిళా విభాగం

జిల్లా మాజీ అధ్యక్షురాలు, చిత్తూరు

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

అన్నదాత ఆక్రోశం

అన్నదాతకు అండగా ర్యాలీకి విశేష స్పందన

అధిక సంఖ్యలో తరలివచ్చిన రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

పూలే భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ

పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు

రైతుల డిమాండ్లు పరిష్కరించాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ విద్యాధరికి వినతిపత్రం

ర్యాలీకి కూటమి మోకాలడ్డు

శాంతియుతంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ చేపట్టిన అన్నదాతకు అండగా ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. ర్యాలీ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ముందస్తుగానే పోలీసులకు తెలిపా రు. అయితే ఉద్దేశపూర్వకంగా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్‌సీపీ ర్యాలీ చేపట్టిన సమయంలోనే బైక్‌ ర్యాలీ చేపట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు మాత్రమే అనుమతి ఉన్న కూటమి ర్యాలీలో కొంత మంది నాయకులు, కార్యకర్తలు బైకులపై కలెక్టరేట్‌ వర కు వెళ్లారు. కాగా పోలీసులు గిరింపేట సర్కిల్‌, దుర్గమ్మ గుడి, పీవీకేఎన్‌ కళాశాల ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. టీడీపీ నాయకుల కుట్రతో ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన ర్యాలీ గంట ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. అధిక సంఖ్యలో విచ్చేసిన రైతులను, పార్టీ శ్రేణులను కలెక్టరేట్‌ వద్ద లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది పార్టీ నాయకులను మాత్రమే వినతిపత్రం అందజేసేందుకు లోనికి అనుమతిచ్చారు. పోలీసులు బందో బస్తు పేరుతో హంగామా సృష్టించారు. కాగా వైఎ స్సార్‌సీపీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ర్యాలీలో పాల్గొన్న పలువురు నేతలు వెల్లడించారు. ఎవరేమన్నారంటే..

నిరసన గళం వినిపించి..

జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ర్యాలీకి అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కర్షకు లు తరలివచ్చి, ఫ్లకార్డులతో చేతపట్టి కూటమి సర్కారుపై నిరసన గళం వినిపించారు. పూలే భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ర్యాలీలో రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చి త్తూరు, గంగాధరనెల్లూరు, నగరి, పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో రైతులు, నాయకు లు, కార్యకర్తలు తరలివచ్చి, అన్నదాతకు అండగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అచ్చార్ల చెరువు మొరవకు గండి 
1
1/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
2
2/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
3
3/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
4
4/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
5
5/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
6
6/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
7
7/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
8
8/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
9
9/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
10
10/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
11
11/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
12
12/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
13
13/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

అచ్చార్ల చెరువు మొరవకు గండి 
14
14/14

అచ్చార్ల చెరువు మొరవకు గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement