సాగునీటి సంఘాలవే‘ఢీ’
జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల వేడి రగులుతోంది. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం కూటమి కుట్రలు పన్నుతోంది. నో డ్యూస్ మెలిక పెట్టింది. అయినా 220 కేంద్రాల్లో పోలింగ్‌కు తెరలేస్తోంది. అయితే ఎన్నికలు సజావుగా సాగడానికి మొత్తం 2,521 మంది సిబ్బంది సమాయత్తం అయ్యారు. పైచేయి ఎవరిదో వేచిచూడాల్సి ఉంది.
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీఎఫ్‌ఎంఐఎస్ చట్టం 1997, 2018వ సంవత్సరం సవరణ చట్టం ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లాలోని 31 మండలాల్లో 215 చిన్న నీటి వినియోగదారుల సంఘాలకు, కార్వేటినగరం మండలం కృష్ణాపురం ప్రాజెక్టు పరిధిలో 5 మొత్తం 220 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు చొప్పున పోలీసులను బందోబస్తుకు నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
220 పోలింగ్ స్టేషన్లు
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించే సాగునీటి సంఘాల ఎన్నికలకు 220 పోలింగ్ స్టేషన్లను అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేశా రు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికలకు ఈఓ, ఏఈఓ, పీఓ, పీఏలు మొత్తం 2,521 మంది విధులు నిర్వహించనున్నా రు. ఈ ఎన్నికలు ఓటింగ్ స్లిప్పుల విధానంలో నిర్వ హించనున్నట్లు అధికారులు తెలిపారు. 49,030 మంది ఓటర్లు సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అడ్డదారుల్లో గెలిచేందుకు కూటమి కుట్రలు
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ కూట మి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందన్న విమర్శలున్నాయి. సాగునీటి రంగంలో రైతుల భాగస్వామ్యంతో ప్రతి ఎకరాకు నీరందించేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కీలకంగా ఉన్న చెరువులు, జలాశయాల పరిధిలోని సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకపక్షంగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆయకట్టుదారులకు ఇరిగేషన్ అధికారులు ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుంది. అయితే నిబంధనలను పాటించకుండా కూటమి ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు అనర్హులకు ఓటు హక్కు కల్పిస్తున్నట్లు విమర్శలున్నాయి.
నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కుట్రలు
అధికారబలంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఎలాగైనా సాగునీటి సంఘాల ఎన్నికల అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ తమదారిలో పెట్టుకుని ఇతరులకు ఎన్నికల్లో అవకాశం కల్పించకుండా కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు సైతం ఏకపక్షంగా చేసుకునేందుకు అవసరమైన అన్ని కుట్రలను అధికార పార్టీ ప్రయోగిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పా ర్టీకి అవకాశం లేకుండా చేసేందుకు అడ్డదారుల్లో వెళుతూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలకు అవసరమైన నో డ్యూస్ సర్టిఫికెట్ నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాల్లో పలువురికి ఇవ్వకుండా కుట్రలకు పాల్పడ్డారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
ఉదయం 8 నుంచి సాయంత్రం
5 గంటల వరకు
జిల్లాలోని 31 మండలాల్లో 220 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment