ప్రాణాలు పణంగా పెట్టి ..
ఎస్‌బీఆర్‌పురం చెరువులో బోటుపై 11 కేవీ లెన్ మరమ్మతులు చేస్తున్న విద్యుత్ సిబ్బంది
అల్పపీడనం కారణంగా ఎస్‌బీఆర్‌పురం చెరువులో ఉన్న 11కేవీ లైన్ గురువారం పాడైంది. దీంతో దిగువ లోతట్టు ప్రాంతాల్లో రెండు రోజులుగా కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో మరమ్మతులు చేయడానికి వాతావరణం సహకరించలేదు. దీంతో శుక్రవారం పుత్తూరు ఏఈ జయసాయి ఆధ్వర్యంలో లైన్‌మన్ వేణు, జేఎస్‌ఎం అశోక్ బోటు సాయంతో చెరువులో ఉన్న 11 కేవీ మెన్‌లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
– వడమాలపేట(విజయపురం)
Comments
Please login to add a commentAdd a comment