పక్కాగా గుర్తింపు కార్యక్రమం
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం, అలింకో సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేయాలని జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఎంపీడీఓలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు అర్హులైన దివ్యాంగులు, వృద్ద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాల గుర్తింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. తదనంతరం సంబంధితదారులకు కృత్రిమ అవయవాలు, చేతి కరల్రు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, టచ్‌ఫోన్లు అందించడం జరుగుతుందన్నారు. శిబిరాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. 17న చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల, 18న ఎస్‌ఆర్‌పురం జెడ్పీ హైస్కూల్, 19న పూతలపట్టు జెడ్పీ హైస్కూల్, 20 నగరి పీఎన్‌సీ ప్రభుత్వ బాలుర హైస్కూల్, 21న పుంగనూరు బీఆర్ ప్రభుత్వ హైస్కూల్, 22న పలమనేరు జెడ్పీ హైస్కూల్, 23న కుప్పంలోని రాజువారి పార్కు వద్ద, 24న రామకుప్పం జెడ్పీ బాలుర హైస్కూల్లో శిబిరాలు జరుగుతాయన్నారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్, సదరం, రేషన్ కార్డు, ఆదాయ ఽఽధ్రువీకరణపత్రాలు రెండు సెట్ల జిరాక్స్, 4 ఫొటోలు వెంట తీసుకుని రావాలన్నారు.
16 నుంచి ధనుర్మాస
తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి కల్చరల్ : పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశ వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపా రు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్డులోని వరదరాజ స్వామివారి ఆలయంలో తి రుప్పావై ప్రవచనాలను పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన శ్రీగోదాదేవి ధనుర్మా సం వ్రతం చేశారు. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యా రని భాగవతం దశమ స్కందంలో ఉంది. ఈ వ్రతం ఎలా ఆచరించాలనే విషయాన్ని గోదాదేవి 30 పా శురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లో కానికి అందించారు. ఈ వ్రతాన్ని అందరూ కలి సి చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చె బుతున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యా ప్తంగా ఉన్న అన్ని వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment