మొగిలిఘాట్‌లో అంబులెన్స్ బోల్తా
పలమనేరు: ప్రమాదాలకు నిలయంగా మారిన మొగిలిఘాట్‌లో శుక్రవారం ఓ ప్రైవేటు అంబులెన్స్ అతివేగంగా వెళ్లి అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల కాలంలో ఘాట్‌లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున పోలీసులు, సంబంధిత అధికారులు అక్కడ వేగనిరోధకాలను భారీగా ఏర్పాటు చేశారు. అయితే వేగంగా వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
అచ్చార్ల చెరువు మొరవకు గండి
రొంపిచెర్ల: మండలంలోని మోటుమల్లెల పంచాయతీ వంకిరెడ్డిగారిపల్లెకు సమీపంలోని అచ్చా ర్ల చెరువు మొరవ తెగింది. దీంతో చెరువులో నీరంతా వృథాగా పోతుందని రైతులు తెలిపారు. అచ్చా ర్ల చెరువు కట్ట కూడా బలహీనంగా ఉందని తెలిపారు. చెరువు తూములో గతంలో నీరు రాలేదని కొందరు రైతులు చెరువు తూము పగల గొట్టారని తెలిపారు. దీంతో తూములో నుంచి నీరు వృథాగా పోతుందన్నారు. తూములో మట్టి వేసినా లాభం లేదన్నారు. ఈ చెరువు మోటుమల్లెల పంచాయతీలోనే పెద్ద చెరువుగా పేరు ఉందన్నారు. చెరువు నిండితే చుట్టు పక్కల వ్యవసాయ బోర్లలో నీరు సంవృద్ధిగా ఉంటాయన్నారు. ఈ చెరువుకు తలకోన అడవుల నుంచి నీరు ఎక్కువగా వస్తుంద న్నారు. అధికారులు వెంటనే స్పందించి తూముకు ఇసుక బస్తాలను వేస్తే కొంత ప్రయోజనం ఉంటుందని రైతులు తెలిపారు. చెరు వు మొరవను పూర్తి స్థాయిలో నిర్మించలేదన్నారు. కొంత వరకే నిర్మించి మరి కొంత భాగం వదిలి వేయడంతో కోతకు గురై, మొరవ గండి పడి, నీరంతా వృథాగా పోతుందన్నారు. చెరువు తెగితే భారీ నష్టం జరు గుతుందని రైతులు భయందోళన చెందుతున్నా రు. అధికారులు ప్రజా ప్రతినిధులు తగు చర్యలు తీసుకుని చెరువు మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment