చదరంగ రారాజు గుకేశ్
● చెస్ పోటీల్లో గెలుపుపై విజయోత్సవం
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన దొమ్మరాజు గుకేశ్ పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించడం జిల్లాకే గర్వకారణమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి విజయోత్సవం జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నవయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా గుకేశ్ అద్భుత విజయం సాధించడం చారిత్రాత్మకమన్నారు. నేటి క్రీడాకారులు గుకేశ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శరత్, పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
18 ఏళ్ల కుర్రాడు చెస్‌లో రాణించడం
అభినందనీయం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో 18 ఏళ్ల కుర్రాడు గుకేశ్ 32 ఏళ్ల క్రీడాకారుడితో పోరాడి గెలిచిన తీరు అభినందనీయమని ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చెస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగపూర్‌లో జరిగిన చెస్ చాంపియన్‌షిప్ తుదిపోరులో గుకేశ్ అద్భుత విజయం సాధించారన్నారు. అతను ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి కావడం ఆనందదాయకమని చెప్పారు. అతన్ని నేటితరం విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని జిల్లా నుంచి మరింత మంది చెస్‌లో గ్రాండ్ మాస్టర్లుగా ఎదగాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ క్రీడ వైపు మక్కువ పెంచుకునేలా ప్రోత్సాహం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ, బాలుసోమ్‌నాథ్, దినేష్, జయకుమార్, శ్రీనివాసులు, బాల, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment