భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో శుక్రవారం కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గిరింపేటలోని శ్రీ చిదంబరేశ్వరస్వామి ఆలయంలో ఉదయం అభిషేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తరించారు. దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే దుర్గానగర్ కాలనీలోని శ్రీ వినాయకస్వామి ఆలయంలో శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. దొడ్డిపల్లిలోని సప్తకనికలమ్మ ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. రాత్రి దీపోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపారాధన చేశారు. అన్నదానం చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పూతలపట్టు(కాణిపాకం): పూతలపట్టు మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. తిమ్మిరెడ్డిపల్లి వద్ద రఘునాథయ్య(65) అనే వ్యక్తి పాలు తీసుకుని రోడ్డు దాటుతుండగా ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment