వరసిద్ధుడికి రూ.1.97 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దేవస్థా నం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. ఉదయం లెక్కింపు ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు సాగింది. కాగా హుండీల ద్వారా రూ.1,97,76,188 ఆదాయం వచ్చినట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. గోసంరక్షణ హుండీ ద్వారా రూ.17,242, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.35,700 వచ్చిందన్నారు. యూఎస్ ఏవీ 1,344 డాలర్లు, యూఏఈ 10 దిర్హామ్స్, ఇంగ్లాడ్‌వి 35 పౌండ్స్, యూరోవి 155 యూరో లు, కెనడావి 10 డాలర్లు, సింగపూర్‌వి 80 డాలర్లు, ఆస్ట్రేలియావి 290 డాలర్లు వచ్చాయన్నారు. బంగారం 75 గ్రాములు, వెండి 4.10 కిలోలుగా లెక్క తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు, బాలరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
31వరకు ఎస్సీ కులగణన సోషల్ ఆడిట్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 31వ తేదీ వరకు ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారన్నారు. ఆ వివరాల్లో ఏవైనా అభ్యంతరాలున్నట్లు అయితే ఈ నెల 31వ తేదీ లోపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. కులగణన తుది వివరాలు 2025 జన వరి 10వ తేదీన సచివాలయాల్లో ప్రదర్శి స్తామని చెప్పారు. కులగణనపై మూడు దశల్లో తనిఖీలుంటాయన్నారు. పేరు, ఆధార్ నంబ ర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తారన్నారు. ప్ర జల నుంచి వచ్చే అభ్యంతరాలను వీఆర్వోలు పరిశీలించి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు పంపుతా రని చెప్పారు. ఆర్‌ఐ పునఃపరిశీలన చేసి, తహసీల్దార్‌కు నివేదికలు పంపుతారన్నారు. ఆ తర్వాత తహసీల్దార్, వీఆర్వో, ఆర్‌ఐ నివేదిక ల్లో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి వివరాలు భద్రపరుస్తారన్నారు. ఈ వివ రాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఏఎస్‌డబ్ల్యూఓలతో సరా సరి 50 వివరాలు ర్యాండమ్‌గా తనిఖీ చేయిస్తామన్నారు. సోషల్ ఆడిట్‌ను తనతో పాటు, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
చిత్తూరు అర్బన్: పోలీ సు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించి న ప్రాథమిక రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 30 నుంచి జనవరి 10వ తేదీ వ రకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్న ట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చి త్తూరులోని పోలీసుల అతిథి గృహంలో శుక్రవారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో 990 మంది మహిళలు, 4,248 మంది పురుషు లు మొత్తం 5,238 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. వారి కి ఈనెల 30 నుంచి జనవరి 10వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఫి జికల్ మెజర్మెంట్, ఎఫిషియన్సీ పరీక్షలను స మర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ, సిబ్బంది బాధ్యతలపై అవగాహన కల్పించాలన్నారు. అభ్యర్థులు అన్ని విద్యార్హత, మెడికల్ పత్రాలు వెంట తెచ్చుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment