పోలీసుల ఎదుట అల్లుడి వాంగ్మూలం
వేలూరు: వేలూరు బాగాయం సమీపంలోని మేట్టు ఇడయంబట్టు గ్రామానికి చెందిన సాలుమోన్ రిటైర్డ్ బీడీఓ. ఇతని భార్య మేరిసెలీన్. వీరికి కుమారుడు అలెక్స్ దేవప్రసాద్, కుమార్తె రాధిక ఉన్నారు. ఈనెల 14 మేట్టు ఇడయంబట్టు గ్రామం నుంచి రాధిక, తన భర్త జబదురై కలిసి తిరువళ్లూర్‌లోని ఇంటికి వెళ్లారు.
ఈ క్రమంలో సాలుమోన్ చైన్నెలోని తన కుమారుడి ఇంటికి వెళ్లారు. దీంతో జబదురై అతని స్నేహితుడు హుస్సీన్‌తో కలిసి ఆటోలో మేట్టుఇడయంబట్టులోని అత్తగారింటి బీరువాను ధ్వంసం 60 సవరాల బంగారం చోరీ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు జబదురై, అతని స్నేహితుడు హుస్సీన్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపి వారి వద్ద ఉన్న రూ.18 లక్షలు విలువ చేసే 60 సవరాల బంగారం, చోరీకి ఉపయోగించిన ఆటోలను పోలీసులు స్వాఽధీనం చేసుకొని విచారణ చేపట్టారు.
ఇందులో అలెక్స్ దేవప్రసాద్‌కు వివాహం జరిగి పిల్లలున్నారు. అయితే రాధిక, జబదురైకు పిల్లలు లేరు. ఇదే సమయంలో అత్త మేరీసెలీన్ రెండు నెలల క్రితం మృతి చెందారు. దీంతో అత్తగారింటి నగలు వారసులు లేక పోవడంతో తనకు దక్కవేమో అనే అనుమానంతో జబదురై ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. స్థానికంగా ఈ చోరీ సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment