
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: పెళ్లయి మూడేళ్లవుతోంది. కానీ ఆ దంపతుల మధ్య ఇప్పటివరకు కార్యం జరగలేదు. ఎంతగా ప్రయత్నించినా భర్త అంగీకరించడం లేదు. ఏదో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నాడు. తన లోపాన్ని కప్పి పుచ్చి వరకట్నం అడిగినంత ఇస్తేనే నీతో కలుస్తానని చెప్పాడు. అడిగినంత డబ్బు ఇస్తున్నా కలయికకు అయిష్టంగా ఉండడంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉండే భర్త ఫోన్‌ను లాక్కుని చూడడంతో ఆమె షాక్‌కు గురయ్యింది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవనం కోర్టు మెట్లు ఎక్కింది. విడాకులు కావాలని భార్య న్యాయస్థానంలో పోరాడుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
31 ఏళ్ల బ్యాంకు ఉద్యోగితో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి 2018 జూన్‌లో వివాహమైంది. అతడికి ఇది రెండో వివాహం. పెళ్లయినప్పటి నుంచి ఆమెతో పడక గదిలో గడపడం లేదు. ఏమని ప్రశ్నిస్తే మొదట్లో అదనపు కట్నం తెస్తేనే అని పట్టుబట్టాడు. దీంతో ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. అయినా కూడా భర్తతో కార్యం జరగలేదు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇలా ఏకంగా మూడేళ్ల పాటు దూరం పెడుతున్నాడు. అయితే అతడు తరచూ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. వేరే యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడేమోనని అతడి ఫోన్ తీసుకుని పరిశీలించింది. అయితే అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్ చేస్తున్నాడు. దీంతోపాటు గే యాప్‌లలో ఆయన ప్రొఫైల్ ఉంది. ఇది చూసి ఆమె షాక్‌కు గురయ్యింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు రహాస్యం బహిర్గతపరిచాడు.
తాను స్వలింప సంపర్కుడినని.. గే డేటింగ్ యాప్‌లలో ప్రొఫైల్ ఉందని అంగీకరించాడు. దీంతో ఆమె అతడితో విడిపోవాలని నిశ్చయించుకుంది. వెంటనే ఆమె బవసణ్నగుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అతడి మొదటి భార్య కూడా ఇదే కారణంతో అతడిని వదిలేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం ముందే తెలిసీ తనకు అతడితో పెళ్లి చేశారని బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ పోరాటానికి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment