బారులు తీరిన లారీలు
సీతానగరం: మండల కేంద్రమైన సీతానగరం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచాయి. మంగళవారం ఉదయం సీతానగరం పెట్రోల్ బంక్ నుంచి ముగ్గళ్ళ వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు ఇసుక కోసం నిలిచిపోయాయి. మూడు రోజులుగా వంగలపూడి ఓపెన్ రీచ్‌లో ట్రాక్టర్ డ్రైవర్లకు, ర్యాంపు నిర్వాహకులకు రవాణా చార్జీలపై తలెత్తిన వివాదంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో అధిక సంఖ్యలో లారీలు ర్యాంపు వద్దకు చేరుకుని ఇసుక కోసం మూడు రోజులుగా నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ చినరాముడు సూచనలతో సోమవారం సాయంత్రానికి సమస్య పరిష్కారం అయింది. మంగళవారం ఉదయం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ట్రాక్టర్లతో స్టాక్ పాయింట్ వద్ద ఇసుకను డంపింగ్ చేశారు. పొక్లెయిన్‌తో లారీలపై ఇసుక ఎగుమతి చేశారు. అయితే ఉదయం నుంచి సీతానగరం నుంచి ముగ్గళ్ళ వరకు వంగలపూడి రీచ్ వద్దకు వెళ్లడానికి లారీలు పెద్దసంఖ్యలో రావడంతో మూడు కిలోమీటర్లు పొడవునా నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్‌లు, ఆటోలు, కార్లు వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడిండి. లారీల పక్కన ఉన్న రోడ్డు నుంచి వాహన రాకపోకలు జరపడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై అధికారులు దృష్టి సారించి, గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ లారీలు నిలుపకుండా ర్యాంపుల వద్ద నిలుపుకునేలా నిర్వాహకులు సౌకర్యం కల్పించాలని జనం కోరుతున్నారు.
మూడు కిలోమీటర్ల పొడవునా నిలిచిన వైనం
Comments
Please login to add a commentAdd a comment