అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం సమీపంలోని ఈదరపల్లి రోడ్డులో 30 ఏళ్ల ఓ అపరిచిత అతిగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈదరపల్లిలో రోడ్డులో పాడుపడిన ఓ సినిమా ధియేటర్ వద్ద మద్యం మితిమీరి సేవించి ఆ వ్యక్తి తన పేరు, ఊరు చెప్పే స్థితిలో కూడా లేకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు అతడిని మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అతడిని మామాలు స్థితిలోకి తీసుకుని వచ్చేందుకు వైద్యులు శ్రమించారు. చివరకు అతడు సాయంత్రం మృతి చెందినట్లు పట్టణ ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు. మితిమీరి మద్యం సేవించడంతో పాటు అతడికి వేరే రుగ్మత ఏమైనా ఉండడం వల్లే చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తి ఎక్కడ నుంచో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పని నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడా లేదా మరేదైనా కారణంతో గతి తప్పి ఇక్కడకు వచ్చాడా...? అనే దిశగా విచారిస్తున్నారు. ఆ అపరిచిత వ్యక్తి మృతదేహాన్ని కుటుంబీకులు, బంధువులు, తెలుసున్నవారు గుర్తిస్తే పట్టణ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై కిషోర్‌బాబు సూచించారు. మృతదేహం సమాచారాన్ని 8143579127 ఫోన్ నెంబర్‌కు అందించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment