
క్రిస్టియన్ బృంద సంగీతంలో భవాని గిన్నిస్ రికార్డ్
కరప: మండలం వేళంగి గ్రామానికి చెందిన టెక్కలి వీరకన్య భవాని (పల్లవి) క్రిస్టియన్ బృంద సంగీతంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సంగీతాభ్యాసంలో పాస్టర్ అగస్టిన్ ఇచ్చిన ఉచిత శిక్షణలో అగ్రగామిగా ఉన్న భవాని విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. అగస్టిన్ దండంగి వేణుగోపాల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒక గంట వ్యవధిలో అత్యధికంగా 1046 పియానో వాయిద్య ప్రదర్శన వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఆమె ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈనెల 14వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో బ్రదర్ అనిల్‌కుమార్, అగస్టిన్ వేణుగోపాల్ తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పార్టిస్‌పేషన్ సర్టిఫికెట్ అందజేసినట్టు భవాని బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు.

క్రిస్టియన్ బృంద సంగీతంలో భవాని గిన్నిస్ రికార్డ్