ఆయుధ కర్మాగారంపై ఎంపీ ప్రకటన సరికాదు
ఏలూరు (టూటౌన్): ఆయుధ కర్మాగారం విషయంలో ఏలూరు ఎంపీ ప్రకటనను సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటన విడుదల చేశారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 వేల కోట్లతో నౌకా విభాగానికి అవసరమైన ఆయుధాల పరిశ్రమకు జనవరి లేదా ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తామని ఎంపీ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పరిశ్రమను వద్దని ముక్తకంఠంతో కోరుతున్నారని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులైన లక్ష కుటుంబాల్లో కేవలం 10 వేల కుటుంబాలకు కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదని, వీరికి నేటికీ ప్యాకేజీ దక్కక, ఇళ్ళు పూర్తికాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆయుధ పరిశ్రమ పెట్టవద్దని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించినా ఎంపీ ఈ విధంగా ప్రకటనలు చేయడం ఆయనకు తగదన్నారు. ఊళ్లో ఫ్యాక్టరీ పెట్టవద్దని ముక్తకంఠంతో చెబుతున్నా పెట్టి తీరుతానని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఉండదన్నారు. పరిశ్రమను స్థాపిస్తే వంకావారిగూడెం పంచాయతీలోని 6 గ్రామాలకు చెందిన 3 వేల మంది నిరాశ్రయులవుతారని తెలిపారు. ఇది ప్రైవేటు పరిశ్రమని.. ఎలాంటి రిజర్వేషన్లు పాటించరని, ఇప్పటికే షెడ్యూల్ గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలిచ్చే జీవో నెం.3 రద్దయిందన్నారు.
బెల్లపు ఊట ధ్వంసం
పోలవరం రూరల్: పోలవరం మండలంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని తానాలకుంట పరిధిలోని చాపరాయి కొండ సమీపంలో దాడులు చేశామని ఎకై ్సజ్ సీఐ ఆర్.సత్యవతి తెలిపారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఎస్సై జి.సునీల్‌కుమార్, పోలవరం స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment