ఐదుగురు సీనియర్ వైద్యుల బదిలీ
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించే పరిస్థితి కానరావడం లేదు. ఆస్పత్రి నుంచి ఐదుగురు సీనియర్లను బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రికి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాదిమంది ప్రజలు వైద్యం కోసం వస్తూ ఉంటారు. రోడ్లు ప్రమాదాలు, అత్యవసర కేసులు వస్తూ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో, గైనకాలజీ, కంటి సంబంధిత వైద్య చికిత్సలు కీలకంగా ఉంటాయి. అత్యవసర స్థితిలో రోగుల ప్రాణాలు రక్షించేందుకు సీనియర్ వైద్య నిపుణుల అవసరం ఎంతైనా ఉంటుంది. ఏలూరు జీజీహెచ్ చీఫ్‌గా డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు చాలా కాలంగా అత్యుత్తమ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఇక ట్రామాకేర్, అత్యవసర కేసులను న్యూరో సర్జన్ డాక్టర్ రవికుమార్ చూస్తున్నారు. ఆయన బదిలీ అయితే అత్యవసర స్థితిలో ఎవరైనా రోగులు వచ్చినా పట్టించుకునే నాథుడే లేదంటున్నారు. డాక్టర్ బీ.రవికుమార్‌ను చింతలపూడి, డాక్టర్ పీ.శ్రీనివాస్‌ను నూజివీడు బదిలీ చేశారు. అలాగే మరో ముగ్గురు సీనియర్ వైద్యులు డాక్టర్ పీఏఆర్‌ఎస్ శ్రీనివాసరావును నూజివీడు, డాక్టర్ లెటోర్న దేవిని నరసాపురం, డాక్టర్ ఏఎస్ రామ్ తణుకు బదిలీ చేయటం సరికాదంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏలూరు జీజీహెచ్‌లో వైద్య సేవలందక ఇక్కట్లు
Comments
Please login to add a commentAdd a comment