గోనె సంచులు ఎక్కడ?
అధికారులపై జేసీ ధాత్రి రెడ్డి ఆగ్రహం
చింతలపూడి: ధాన్యం రైతులకు గోనె సంచులు అందుబాటులో లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ధాన్యం మిల్లులను జేసీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోతునూరు ఆర్బీకే పరిధిలో గోనె సంచులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకే, సొసైటీ వద్ద ఒక్క సంచి కూడా లేకపోవడంతో మండిపడ్డారు. గోనె సంచుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తాను చూసుకుంటానని అన్నారు. మండలంలో ఽఎన్ని గోనె సంచులు అవసరం అవుతాయో నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా దళారులకు మిల్లర్లకు సహకరిస్తున్న పోతునూరు సొసైటీలో ట్రక్ షీట్లు జారీచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్బీకేలను సందర్శించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేచర్ల గ్రామంలో డీఎన్ఆర్ ట్రేడర్స్ మిల్లును తనిఖీ చేశారు. అనంతరం మల్లాయగూడెం శ్రీ లక్ష్మి గణపతి రైస్ మిల్లును తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment