ఏలూరు(మెట్రో): పొగాకు పంటలో నియంత్రణ పాటించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చావేదిక నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే రుగ్మతలు, అనర్థాలు, దుష్ఫలితాల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా, ప్రిన్సిపల్ సైంటిస్టు సుబ్బయ్య, ఉద్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment