బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి
ఏలూరు (టూటౌన్): రబీ పంటల బీమా ప్రీమి యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, బీమా ప్రీమియం పేరుతో రైతులపై భారం వేయవద్ద ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేశారన్నారు. అదే తరహాలో ఈ రబీ సీజన్‌లోనూ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోరారు.
పనివేళల మార్పు సరికాదు
దెందులూరు: పాఠశా లల పనివేళలు మా ర్చడం సరికాదని, పా త టైమ్‌టేబుల్ కొనసాగించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కలపాల సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టడం లేదన్నారు. విద్యావ్యవస్థపై ప్రయోగాలు మాని, నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని కోరారు. జీఓ 117ను రద్దుచేసి, ప్రా థమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.
మద్యం షాపుపై మండిపాటు
కామవరపుకోట: కామవరపుకోట చెక్‌పోస్ట్ సెంటర్‌లో మద్యం షాపు ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని శుక్రవారం గ్రామస్తులు గళమెత్తారు. గ్రామంలోని చెక్‌పోస్ట్ సెంటర్‌లో కనకదుర్గమ్మ ఆలయం ఉందని, ఇటుగా వాహనాల రాకపోకలతో నిత్యంగా రద్దీగా ఉంటుందని, ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ షాపు ఏర్పాటు చేస్తే దశలవారీగా ఉద్యమానికి సిద్ధపడతామని హెచ్చరించారు. కాకి సురేష్ కుమార్, టీవీఎస్ రాజు, నానాది సాగర్, అయితం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్ డీఎస్పీగా చంద్రశేఖర్
ఏలూరు టౌన్: జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీగా బి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. సాధార ణ బదిలీల్లో భాగంగా ఆయన కాకినాడ నుంచి ఏలూరు జిల్లాకు వస్తున్నారు. ఇక్కడ ఏఆర్ డీఎస్పీగా పనిచేస్తున్న వీజీ శ్రీహరిరావు కాకినాడ బదిలీపై వెళుతున్నారు.
‘పోలవరం’ పూర్తిపై సీఎం ప్రకటిస్తారు : ఎంపీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటిస్తారని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే వా రంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారన్నారు. పోలవరం నిర్వాసితుల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయన్నారు.
ఎయిడెడ్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భీమడోలు సీబీసీఎస్ సీ ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉ న్న ఎస్‌జీటీ ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ద రఖాస్తు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతో సీబీసీఎస్‌సీ ఎయిడెడ్ పాఠశాలకు వ్యక్తిగతంగా లేదా పోస్టు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నేడు ప్రత్యేక ఓటరు నమోదు
ఏలూరు(మెట్రో): జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. అర్హులు 6,7,8 ఫారాలు పూర్తిచేసి బీఎల్‌ఓలకు అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment