టీడీపీ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై, పాలనపై అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఎక్స్‌లో ట్వీట్లు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కోరారు. ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. సమన్వయ కర్తలు కంభం విజయరాజు (చింతలపూడి), మామి ళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), పార్టీ నేతలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆధారాలతో కూడిన ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు పార్టీ కార్యాలయంలో పార్టీ బలోపే తానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించుకుంటూ ఉండగా.. తన సెల్‌ఫోన్‌లో ఎక్స్ మాధ్యమంలో జగన్ ను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన ట్వీట్లు, మార్ఫింగ్ చేసిన చిత్రాలను పోస్ట్ చేయగా చూశానని తెలిపారు. మంత్రి లోకేష్ ట్విట్టర్ ఐడీ, ఇతర మంత్రుల ట్విట్టర్ ఐడీలతో అత్యంత దారుణంగా అసత్యాలను ప్రచారం చేస్తూ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించటం సరికాదన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ ద్వారా ఈ పోస్టులు తయారుచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ, కుట్రలు, కుటిల ప న్నాగాలతో పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నా రని వివరించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టే లా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నుల జాన్‌గురునాథ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలాడి దుర్గారావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, హిస్టరీ అకాడమీ మాజీ డైరెక్టర్ ఎండీ కై సర్, పార్టీ నేతలు ముదుండి సూర్యనారాయణ, లీగల్ సెల్ నాయకులు ప్రత్తిపాటి తంబి, స్టాలిన్, వీరవల్లి లక్ష్మీకుమా ర్, బుద్దాల రాము, ఫణి తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు
పోలీసులకు వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment