ఏలూరు రూరల్ : ఏలూరు రూరల్ పోలీసులు పైడిచింతపాడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముంగర పెద్దిరాజు, మండల అధ్యక్షుడు నంబూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు నేతల రవి, ఏలూరు రౌడీషీటర్ యాకోబుతో సహా మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం కొల్లేరు గ్రామం పైడిచింతపాడులో పెన్షన్ పంపిణీపై టీడీఈ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన జనసేన నాయకులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాగా, అక్కడ టీడీపీ నాయకులు అడ్డు కుని వారిపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకుని స్థానిక ఆంధ్ర హాస్పటల్‌కు వెళ్లగా అక్కడ కూడా టీడీపీ నాయకులు దాడికి ఉపక్రమించారు. దీంతో జనసేన నాయకులు విజయవాడ వెళ్లి ప్రభు త్వ జనరల్ ఆసుపత్రి ఔట్‌పోస్ట్‌లో ఎమ్మెల్సీ కేసు న మోదు చేసి చికిత్స చేయించుకున్నారు. దీని ఆధా రంగా ఏలూరు రూరల్ పోలీసులు దాడిలో పా ల్గొన్న టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఘర్షణ జరిగిన రోజే టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు జనసేన నాయకులపై ఆఘమేఘాల మీద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment