పెనుమంట్ర: వరి పంటను ఆశించే 18 రకాల పురుగులు, తెగుళ్లపై ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సస్యరక్షణ సిఫార్సులను శాస్త్రవేత్తలు పూర్తిగా పరిశీలించి, రాష్ట్రానికి అనువుగా ఉండేలా మార్పులు చేయాలని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ టి. శ్రీనివాస్ అన్నారు. గురు వారం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి పంట సస్యరక్షణలో మా ర్గదర్శకాలు అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న సమాచార అవసరాలకు అనుగుణంగా ప్రజలంతా డిజిటల్ సాధనాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. పరిశోధన విస్తరణలో డిజిటల్ సేవలతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ము ఖ్య అతిథిగా హాజరైన మధుమంజరి మాట్లాడుతూ గతనెల 13న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాబి ఇంటర్నేషనల్ వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామన్నా రు. మంచి నాణ్యత కలిగిన చిత్రాలు, సమాచా రం అంతా కాబి ప్లాంట్ వైస్ ప్లస్ అనే యాప్‌లో నిక్షిప్తం చేస్తామని చెప్పారు. విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త ఎంవీ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు ఓ ప్రకటనలో తెలిపారు. వారోత్సవాలు ఈనెల 20 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. స్వయం సహాయక మహిళ బృందాలతో ముగ్లు పోటీలు నిర్వహించి, వారికి ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కళాశాలల్లో వర్కుషాపులు, విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రతినెలా పని సర్దుబాటు తగదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రతినెలా పని సర్దుబాటు ప్రక్రియ సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డిదొర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియతో వలన పాఠశాలల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. కాల నిర్ణయ పట్టిక రూపకల్పన, తరగతులను కేటాయించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పని సర్దుబాటు ప్రక్రియ కాకుండా గతంలో మాదిరిగా ప్రతి నెలా పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలనిఇ కోరారు. అలాగే ఐటీడీఏ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను 500 కిలోమీటర్ల పైబడి ఇతర జిల్లాలకు పని సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పంపడం సరికాదని, ప్రక్రియను నిలుపుదల చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
64 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
ఏలూరు(మెట్రో): జిల్లాలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో 665 రెవెన్యూ గ్రామాలుండగా రెండు రోజుల్లో 64 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. గురువారం 30 సదస్సుల్లో 1,212 మంది పాల్గొని ఆయా సమస్యలపై 487 అర్జీలను అందజేశారని, వాటిలో 71 దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మొత్తంగా 64 గ్రామ రెవెన్యూ సదస్సుల్లో 854 అర్జీలు రాగా 96 అర్జీలు పరిష్కరించామన్నారు. జనవరి 8 వరకు సదస్సులు జరుగుతాయని చెప్పారు. ప్రతి మండలానికీ జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించామని అన్నారు.
మోషేన్‌రాజును కలిసిన ఎమ్మెల్సీ గోపిమూర్తి
భీమవరం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన బొర్రా గోపిమూర్తి గురువారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి పూలమొక్క అందించారు. గోపిమూర్తికి మోషేన్‌రాజు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment