అన్నదాత.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. గుండెకోత

Published Fri, Dec 13 2024 1:48 AM | Last Updated on Fri, Dec 13 2024 1:48 AM

అన్నద

అన్నదాత.. గుండెకోత

చిరుద్యోగులపై పచ్చ ప్రతాపం
చిరుద్యోగులైన వీఓఏ (విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌)ల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. బెదిరింపులతో ఆందోళన కలిగిస్తున్నారు. 8లో u

శురకవారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆరు నెలల కూటమి పాలనలో అన్నదాత నిట్టనిలువునా దగాకు గురవుతున్నాడు. అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని చెప్పిన కూటమి నాయకుల మాటలు నమ్మి నిండి మునిగాడు. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, విపత్తులతో పంట నష్టం వాటిల్లితే నష్టపరిహారం భారీగా పెంపు ఇలా లెక్కకు మించి హామీలను కూటమి నాయకులు గుప్పించారు.

25 వేల ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో 4.95 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో అత్యధికంగా వరి పండిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో 1.91 లక్షల ఎకరాల్లో, రబీ సీజన్‌లో సుమారు 90 వేల ఎకరాల్లో సాగు ఉంటుంది. వీటితో పాటు ఆయిల్‌పామ్‌ 1,32,167, మొక్కజొన్న 90,674, మామిడి 35,937 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటితో పాటు జీడిమామిడి, పత్తి, వేరుశనగ, మినుము, పొగాకు సాగు ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి దిగుబడులపై ప్రభావం చూపింది.

గత ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం

వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని పథకాలతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటల వ్యవధిలో సొమ్ములను రైతుల ఖాతాలకు జమచేసింది. దీంతో దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్‌ పెట్టింది. వీటన్నింటితో పాటు జిల్లాలో 1,98,179 మంది రైతులకు ఏటా రూ.236.99 కోట్లను పంట ప్రారంభ కాలంలో జమచేసింది. ఇలా రైతుల పెట్టుబడి అవసరాలు తీర్చింది.

ఇప్పుడు దళారీ కొనుగోలు కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా 215 ధాన్యం కొనుగోలు కేంద్రా లను అట్టహాసంగా ప్రారంభించినా ఇవన్నీ దళారీ కేంద్రాలుగా మారిపోయాయి. ధాన్యం సంచులు అందుబాటులో లేకపోవడం, తేమశాతం కొర్రీలు, నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించుకోవచ్చనే నిర్ణయాలతో దళారులకు పూర్తిస్థాయిలో గేట్లు తెరిచినట్టు అయ్యింది. మద్దతు ధర 75 కిలోల బస్తా రూ.1,725 ఉండగా దళారులు రూ.1,400కు కొంటున్నారు. దీంతో రైతులు బస్తాకు రూ.300కు పైగా నష్టపోతున్నారు. రైతు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌, సంతకాలు తీసుకుని కొందరు దళారులు కొనుగోళ్లు కేంద్రాల్లో విక్రయించడంతో పాటు పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. దళారీ కొనుగోళ్లను మొత్తం అధికారిక కొనుగోళ్లుగా ప్రభుత్వం చూపుతోంది. ఇలా రైతులు ఓ పక్క తగ్గిన దిగు బడులు, దక్కని మద్దతు ధరతో నష్టపోతున్నారు.

న్యూస్‌రీల్‌

కూటమి సర్కారు దగా

అన్నదాతపై కూటమి సర్కారు కక్ష కట్టింది.. అన్నదాత సుఖీభవ పథకాన్ని అటకెక్కించింది.. ఉచిత పంటల బీమాకు స్వస్థి పలికి భారం మోపింది. ధాన్యం కొనుగోళ్లలో దళారులకు గేట్లు తెరిచి మద్దతు ధరలు రాకుండా చేస్తోంది. ఓ పక్క ప్రకృతి విపత్తులు.. మరో పక్క కూటమి సర్కారు నిర్ణయాలతో వ్యవసాయం అప్పులమయంగా మారింది. దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం ఏలూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనుంది.

కూటమి కక్ష

రైతు భరోసాకు మంగళం

అటకెక్కిన ఉచిత పంటల బీమా

విపత్తుల వేళా పట్టించుకోని సర్కారు

ధాన్యం కొనుగోళ్లలో దళారులదే హవా

రైతులకు దక్కని మద్దతు ధరలు

రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట

నేడు ఏలూరులో భారీ నిరసన ర్యాలీ

నేడు వైఎస్సార్‌సీపీ నిరసన

అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం ఏలూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లోని దివంగత వైఎస్సార్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నారు.

కూటమి సర్కారు హామీ మేరకు జిల్లాలోని 1,98,179 మంది రైతులకు రూ.336 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద జమచేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ దీనిపై కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే జగన్‌ సర్కారులో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఇలా జిల్లాలో రూ.22.56 కోట్లను బీమా కింద ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుత కూటమి సర్కారులో ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రూ.615ల ప్రీమియం రైతులే చెల్లించాలని భారం మోపారు. అలాగే కౌలు రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 64,873 మందికి కౌలురైతు గుర్తింపు కార్డులు ఉన్నా కేవలం 22 వేల మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అన్నదాత.. గుండెకోత 1
1/2

అన్నదాత.. గుండెకోత

అన్నదాత.. గుండెకోత 2
2/2

అన్నదాత.. గుండెకోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement