బాలల పథకాలపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమాజంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, భిక్షాటన చేసే బాలలు వంటి వివరాలు తెలపడానికి 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వారి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. బాలల హక్కులు, సంక్షేమ పథకాలు, చట్టాలపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల హక్కులు, సంక్షేమ పథకాలు చట్టాలపై అ వగాహన కార్యక్రమాన్ని గురువారం లయన్స్ క్లబ్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక అమలోద్భవి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలకు సంబంధించిన సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్యానెల్ అడ్వకేట్ కూన కృష్ణారావు మాట్లాడుతూ బాలలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టం, సెల్‌ఫోన్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. స్కూల్ హెచ్‌ఎం సిస్టర్ నిర్మల, లయన్స్ క్లబ్ ప్రతినిధి సీవీ రమణ, డీసీపీయూ సిబ్బంది పి.రాజేష్, వై.రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment