సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన
కై కలూరు: ఆక్వా ఎగుమతులు, కొనుగోళ్లు, రవాణా వంటి అంశాలపై పరిశీలనకు గురువారం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) అధికారు లు కైకలూరులో పర్యటించారు. కై కలూరు మత్స్య శాఖ కార్యాలయంలో సెంట్రల్ వేర్ హౌసింగ్ కా ర్పొరేషన్ డీజీఎం దిబాపతి షా చౌదరీ, సీడబ్ల్యూసీ ఏజీఎం జ్ఞానపడి, ఆటపాక వేర్‌హౌస్ మేనేజర్ పి.చిరంజీవినాయుడు, మత్స్యశాఖ ల్యాబ్ ఏడీ రాజ్‌కుమార్ నుంచి పలు అంశాలపై చర్చించారు. వేర్ హౌస్ మేనేజర్ చిరంజీవినాయుడు మాట్లాడుతూ సీడబ్ల్యూసీ ద్వారా ఫిషరీస్ రంగానికి ఎటువంటి సేవలు అందించాలి, దళారీ వ్యవస్థ లేకుండా ఆక్వా ఉత్పత్తుల విక్రయాలకు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనే అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఆయా అంశాలపై మరో విడత చర్చిస్తామని, అనంతరం పూర్తి వివరాలతో నివేదిక అందిస్తారన్నారు. అనంతరం అధికార బృందం భైరవపట్నం వద్ద చేపల ప్యాకింగ్ సెంటర్‌ను పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment