నాయకత్వంలో మాస్టార్‌లుగా..
నిడమర్రు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. అనేక సంస్కరణలతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. దానిలో భాగంగానే గత ఏడాది ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ శిక్షణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. విద్యాశాఖ ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా హెచ్‌ఎంలకు లీడర్ షిప్ శిక్షణ–2 పేరుతో ఈ నెల 8 నుంచి భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ప్రారంభించారు. శనివారంతో మొదటి బ్యాచ్ శిక్షణా తరగతులు ముగియనున్నాయి. ఈ శిక్షణా షెడ్యూల్, కోర్సును ఏపీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (ఏపీ సీమాట్) సంస్థ రూపొందించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 988 మంది హెచ్‌ఎంలకు రెసిడెన్షియల్/ నాన్ రెసిడెన్షియల్ విధానంలో ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. మొత్తం హెచ్‌ఎంలకు ఫిబ్రవరి నెలాఖరు వరకూ 5 విడతలుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రతి బ్యాచ్‌కు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన 10 మంది మాస్టర్ ట్రైనీలు హాజరవుతారని డీఈవో నారాయణ తెలిపారు.
సమగ్రంగా.. సంపూర్ణంగా
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు సమర్ధవంతంగా నిర్వహించాలంటే ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు తప్పనసరిగా దృఢమైన నాయకత్వ లక్షణాలు ఉండాలని విద్యాశాఖ ఆలోచన. శిక్షణ తూతూమంత్రంగా ఉండకుంగా సమగ్రంగా.. సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ జరుగుతుంది. ప్రతి బ్యాచ్‌కు 6 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. రెసిడెన్షియల్ హెచ్‌ఎంలకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ, నాన్ రెసిడెన్షియల్ హెచ్‌ఎంలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు.
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాల నాయకత్వంపై శిక్షణ
ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి 198 మంది హెచ్‌ఎంలకు శిక్షణ
నేటితో మొదటి బ్యాచ్‌కు
తరగతులు పూర్తి
శిక్షణలో అంశాలు
వైకల్యం వంటి శారీరక లోపాలకు అతీతంగా బోధించడం
పాఠశాల పరిస్థితుల అంచనా, వాటిని పరిష్కరించడం
విద్యా వ్యవస్థలోని నూతన విధానాలను అందిపుచ్చుకోవడం
పాఠశాలకు అందుతున్న వివిధ రకాల నిధుల వినియోగం
విద్యార్ధుల సామర్థ్యాలు, నైపుణ్యాల అభివృద్ధి
సాంకేతిక విద్యా విధానం బోధను అందిపుచ్చుకోవడం
తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలు
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారంతో ముందుకు సాగడం
తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన
విద్యాశాఖ రూపొందిస్తున్న వివిధ రకాల యాప్‌ల వినియోగం
జిల్లా మొత్తం మొదటి
హెచ్‌ఎంలు బ్యాచ్‌లో
ఏలూరు 573 100
పశ్చిమగోదావరి 415 98
మొత్తం 988 198
Comments
Please login to add a commentAdd a comment