తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం సమన్వయకర్త
నేడు రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా పాలన చేస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాం. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేసే వరకూ వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని చేస్తుంది.
ప్రజలపై మోయలేని భారాలు
పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు సమన్వయకర్త
వ్యవసాయం దండగా.. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన సీఎం చంద్రబాబును నమ్మి రాష్ట్రంలోని రైతులంతా మరలా దారుణంగా మోసపోయారు. కూటమి ప్రభుత్వం ఓ వైపు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలు, రైతులపై మోయలేని భారాన్ని మోపుతూనే మరోవైపు రైతులకు పంట సాయం, మద్దతు ధర ఇవ్వకుండా క్షోభ పెడుతోంది. వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది.
విద్యుత్ చార్జీల బాదుడు
కంభం విజయరాజు, చింతలపూడి సమన్వయకర్త
ఓ వైపు రైతన్నలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ చార్జీల బాదుడుతో దారుణంగా దెబ్బతీస్తోంది. రాష్ట్ర ప్రజలపై ఆరు నెలల్లోనే సుమారు రూ.15 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేయడం దారుణం. సామాన్య ప్రజలు తమ జీవనానికి కనీసం పనులు లేక తీవ్ర కష్టాల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం? అని ప్రజలు నెత్త్తీనోరు బాదుకుంటున్నారు.
గుణపాఠం తప్పదు
మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు సమన్వయకర్త
గతంలో వైఎస్సార్‌సీసీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు సంక్షేమ పాలన అందిస్తే.. నేడు కూటమి సర్కారు రైతులను దారుణంగా మోసం చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని సైతం రద్దు చేయటం వారి మోసపూరిత పాలనకు నిదర్శనం. ఇప్పటికే ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విసుగెత్తిపోయారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment