ఏలూరు(మెట్రో): భూ సమస్యల పరిష్కారమే ధ్యే యంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లాలోని 28 మండలాల్లో 665 రెవెన్యూ గ్రామాలకు ఇప్పటివరకు 101 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామన్నారు. శుక్రవారం 36 సదస్సులు నిర్వహించగా 1,852 మంది పాల్గొని 305 అర్జీలను అందజేశారన్నారు. వాటిలో 34 దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మొత్తంగా 5,360 మంది హాజరై 1,159 అర్జీలు ఇవ్వగా 150 అర్జీలు పరిష్కరించామని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment