30 నుంచి జిల్లా క్రీడా జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

30 నుంచి జిల్లా క్రీడా జట్ల ఎంపికలు

Published Fri, Sep 27 2024 3:52 AM | Last Updated on Fri, Sep 27 2024 3:52 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి అండర్‌–14, 17 జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించనున్నట్లు ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి మెల్లంపూడి రవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 30న తాడేపల్లి మండలం పెనుమాక జెడ్పీ హైస్కూల్లో బాలబాలికలకు అథ్లెటిక్స్‌, అచ్చంపేటలోని ఏపీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెజ్లింగ్‌, నరసరావుపేటలోని మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో బాస్కెట్‌బాల్‌ ఎంపికలు జరుగుతాయని వివరించారు. అక్టోబర్‌ 1న కారంపూడిలోని జెడ్పీ హైస్కూల్లో అండర్‌–14 విభాగంలో ఖోఖో, తెనాలిలోని పాత ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న జేఎస్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో తైక్వాండో ఎంపికలు ఉంటాయని చెప్పారు. వివరాలకు 99633 86100 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కుంచనపల్లిలోని అరవింద హైస్కూల్లోఅండర్‌–14, 17 విభాగాల్లో కరాటే పోటీలకు 95817 66907 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. అక్టోబర్‌ 1న గుంటూరు అమరావతిరోడ్డులోని ఆలా ఆస్పత్రి వద్ద ఉన్న ఇండియన్‌ షూటింగ్‌ అకాడమీలో జరిగే పోటీలకు 94906 39441లో సంప్రదించాలని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement