మాచర్ల: మాచర్ల ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికుమార్ టీడీపీ, జనసేన నేతలపై పెట్టిన పోస్టింగ్‌లకు సంబంధించి విశాఖ పట్టణంలో కస్టడీలో ఉన్న అతనిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం మాచర్ల పోలీసులు అనుమతి కోరగా కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు చెందిన ఇంటూరు రవిని మాచర్ల పోలీసులు తీసుకొచ్చి విచారించిన అనంతరం తిరిగి కస్టడీకి పంపారు. ఇందుకు సంబంధించి అర్బన్ సీఐ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని విచారించి పంపటం జరిగిందని చెప్పారు.
జూడో పోటీలకు ఎంపిక
నరసరావుపేట రూరల్: సౌత్ అండ్ వెస్ట్ జోన్ జూడో పోటీలకు ఎన్‌ఈసీ విద్యార్థి సి.హెచ్.కార్నెల్‌బాబు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలోని శ్రీ పొట్టిశ్రీరాములు సీఎంరావు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్‌టీయూకె అంతర్ కళాశాలల జూడో ఎంపిక పోటీలలో కార్నెల్‌బాబు ప్రతిభ కనబర్చినట్టు వివరించారు. ఈనెల 27వ తేదీ 30వ తేదీ వరకు భోపాల్‌లోని ఎన్‌ఎన్‌సీటీ యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్‌అండ్ వెస్ట్‌జోన్ పోటీలలో కార్నెల్‌బాబు జేఎన్‌టీయూకెకు ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment