పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
గుంటూరు వెస్ట్: పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పత్తి రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, సీసీఐ అధికారులు, పత్తిరైతుల నాయకులతో శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 41 కేంద్రాలు ఉన్నాయన్నారు. 24 గంటల్లో మరో 20 ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సీసీఐ అంటే వ్యాపార సంస్థ కాదని పేర్కొన్నారు. పత్తిని ఇకపై శనివారం కూడా కొంటారని చెప్పారు. సాయంత్రం 6 వరకు ఉండే కొనుగోలు సమయాన్ని కూడా 7.30 వరకు పెంచాలన్నారు. వచ్చే మార్చి చివరి వరరకు పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. తేమ శాతం పెద్ద సమస్యగా చూపుతున్నారని, లోపాలను వీలైనంత వరకు పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో సీసీఐ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కురదాగి, రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏపీ మాదిగ సంక్షేమ సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, గుంటూరు మార్కెటింగ్ జీఎం అమర్నాథ్ రెడ్డి, అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో ఇబ్బందులను
అధిగమిస్తాం
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
Comments
Please login to add a commentAdd a comment