అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం చేయాలి
గుంటూరు వెస్ట్: ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కేసు విచారణ జరపాలన్నారు. ఆ సమయంలోనే అన్ని విషయాలు పరిశీలించాలని సూచించారు. మూడు నెలలు, అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్న కేసులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలన్నారు. కులధ్రువీకరణ పత్రాలను విచారించి వారంలోపే చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు సక్రమంగా నష్టపరిహారం అందించాలని తెలిపారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆన్ అఫీషియల్ మెంబర్ల నియామకం త్వరలోనే జరుగుతుందనాన్నారు. సమావేశంలో డీఆర్వో ఖాజావలి, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, గిరిజన సంక్షేమ శాఖాధికారి మురళీధర్, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమ కుమారి, డీపీఓ సాయికుమార్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment