ప్రజా సమస్యలను పరిష్కరించండి
తాడికొండ: గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కారం చూపాలని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ సూచించారు. శుక్రవారం తుళ్ళూరు సీఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌డేలో రాజధాని రైతుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు అలసత్వం వహించకుండా పనిచేయాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. శుక్రవారం భూ వ్యవహారాలు – 61, ప్రణాళికా విభాగం–2, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్–1, డెవలప్‌మెంట్ ప్రమోషన్స్– 5 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.స్వర్ణమేరీ, బి.సాయి శ్రీనివాస్ నాయక్, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ జీసీ రామకృష్ణన్, డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment