
వరంగల్: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను గొంతునులిమి చంపిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఆర్‌ఎన్‌ఆర్‌నగర్‌కు చెందిన బట్టు వెంకన్నను తన భార్య స్వప్న.. ప్రియుడు ప్రశాంత్ సహకారంతో ఏప్రిల్ 21న చంపింది. తన అన్న వెంకన్న అనుమానాస్పదంగా మృతి చెందాడని తమ్ముడు లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. పోస్టుమార్టం నివేదికలో వెంకన్న గొంతు నులమడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కేసును హత్యగా నమోదు చేశారు. వెంకన్న భార్య బట్టు స్వప్న పరారీలో ఉండడంతో ప్రత్యేక టీమును ఏర్పాటు చేయడంతో అమెను, సహకరించిన ప్రశాంత్‌లను మంగళవారం ఏనుమాములో పట్టుకున్నారు.
వారిని విచారించగా స్వప్నకు అదే కాలనీలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ లావుడ్య ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని వెల్లడైంది. ఈక్రమంలో స్వప్న ప్రశాంత్‌లు సన్నిహితంగా ఉండడం కాలనీవాసుల ద్వారా భర్త వెంకన్నకు తెలిసింది. దీంతో స్వప్నను మందలించడంతో భార్యాభర్తల నడుమ పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. స్వప్న..ప్రియుడు ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లగా వెంకన్నను చంపేందుకు పథకం పన్నారు.
ఏప్రిల్ 21న వెంకన్న మద్యం తాగి వచ్చి భార్య స్వప్నతో గొడవపడ్డాడు. ఆ తరువాత అన్నం తిని పడుకోగా, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో స్వప్న.. ప్రశాంత్‌కు ఫోన్ చేసి చెప్పగా.. ఎన్ని రోజులు భరిస్తావు..నేను ఉన్నాను. ఎలాగైనా వాడిని అంతం చేయమ’ని చెప్పాడు. దీంతో స్వప్న పడుకున్న భర్త గొంతు నులిమి చంపింది. ఈ మేరకు స్వప్న, ప్రశాంత్‌లపైకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.